Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ నిర్మాత కి కూడా నోటి దురుసు


భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీ కి కొంచెం నోటి దురుసు ఎక్కువయినట్టుగా కనిపిస్తోంది. చేతిలో నాలుగు పెద్ద సినిమాలు, నాలుగు చిన్న సినిమాలు ఉండేసరికి, తనే ఇండస్ట్రీ లో పెద్ద నిర్మాత అని అతను ఫీల్ అయిపోతున్నట్టుగా వున్నాడు. అందుకే నోటి దురుసు ఎక్కువైంది అని కొంతమంది ఇండస్ట్రీ లో వాళ్ళే అంటున్నారు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఈవెంట్ కి వచ్చి ఆంధ్ర ప్రభుత్వాన్ని విమర్శించారు, ఆ తరువాత ఏమి జరిగిందో అందరికి తెలిసిందే కదా. ఈరోజు వరకు ఆంధ్ర ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచలేదు సరికదా, సినిమా హాల్స్ కూడా చాలా మూతపడ్డాయి. 

Advertisement
CJ Advs

మళ్ళీ ఇప్పుడు అదే దారిలో నాగవంశీ వెళుతున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ లా మాట్లాడాలా? ఏంటి అని ఇండస్ట్రీలో పలు నిర్మాతలు గుసగుస లాడుతున్నారు. ఇప్పుడే కొంచెం సరియిన దారిలోకి వస్తున్న ఈ నాగవంశీ ఎందుకో అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు అని అంటున్నారు. ఇంతకీ భీమ్లా నాయక్ రిలీజ్ ఎప్పుడు అంటే, జగన్ గారిని అడగండి అన్నాడు వంశి. ఎందుకు అలా అనటం. రెండు తేదీలు ప్రకటనాలు ఇచ్చారు కదా, అదే చెప్పొచ్చు కదా. ఇదే కదా నోటి దూల అంటే!

Jagan To Decide Bheemla Nayak Release: Naga Vamsi:

Bheemla Nayak producer blames Jagan for delayed release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs