Advertisement
Google Ads BL

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన పుష్ప


కన్నడ పవర్ స్టార్, దివంగత శ్రీ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ రోజు బెంగుళూరులో ఆయన నివాసంలో క‌లిసి ప‌రామ‌ర్శించారు. ముందుగా పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ‌రాజ‌కుమార్ ని క‌లిసి.. ఆ తర్వాత పునీత్ సతీమణి అశ్వ‌ని రాజ‌కుమార్ ని, అలాగే ఇత‌ర కుటంబ‌ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. వాళ్లతో కొంత స‌మ‌యం గ‌డిపిన తర్వాత స్వర్గీయ పునీత్ స‌మాధిని సంద‌ర్శించి, ఘ‌న నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్. 

Advertisement
CJ Advs

ఇంత చిన్న వయసులోనే ఆయన హఠాన్మరణం కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని తెలిపారు ఐకాన్ స్టార్. కాసేపటి తర్వాత ఆయన మళ్లీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. 2021, అక్టోబర్ 29న తీవ్రమైన గుండె పోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

 

Allu Arjun Visits Puneeth Rajkumar Family in Bengaluru:

Allu Arjun meets Shiva Rajkumar and pays tribute to Puneeth Raj Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs