Advertisement
Google Ads BL

తారక్ నిశ్శబ్ధం పట్ల అభిమానుల నిరసన


5 సినిమాలతో చిరు జోరుమీదున్నారు. 3 సినిమాలు ఓకే చేసి బాలయ్య ఊపుమీదున్నారు. మహేష్ రాబోయే తన 3 సినిమాలనీ కన్ ఫార్మ్ చేసేసాడు. ఎట్ ఎ టైమ్ 4 సినిమాలు చేస్తూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు. 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా పెట్టుకుని 2 సినిమాలు లైన్ లో ఉంచుకుని రామ్ చరణ్ స్పీడ్ మీదున్నాడు. రవితేజ సైతం 5 సినిమాలని ఆర్థర్ లో పెట్టుకున్నాడు. ఇతర స్టార్స్ అందరూ ఇలా వరుసబెట్టి సినిమాలు చేసేస్తూ ఉంటే తమ హీరో మాత్రం స్లో అవడం తారక్ అభిమానులకి రుచించడం లేదు. 2018 అక్టోబర్ లో వచ్చిన అరవింద సమేత తర్వాత  తారక్ కి .ఏకంగా మూడున్నరేళ్ల గ్యాప్ వచ్చేయడం తన ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 

Advertisement
CJ Advs

ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా నటుడిగా ఎన్ఠీఆర్ కి ఎంతో మంచి పేరు తెచ్చేదే అయినప్పటికీ ప్యారలల్ గా మరో ప్రాజెక్ట్ ఏదీ ప్లాన్ చేసుకోకపోవడం, నేటికి కూడా తారక్ చెయ్యబోయే తదుపరి ప్రాజెక్టులపై మీడియాలో వచ్చే వార్తలే తప్ప అధికారిక ప్రకటనలేవీ రాకపోవడం అభిమానులని అసంతృప్తికి గురి చేస్తోంది. ఇదే అంశాన్ని సోషల్ మీడియా వేదికలపై వ్యక్తం చేస్తూ తారక్ ఫ్యాన్స్ తమ నిరాశని, నిరసనని తెలుపుతున్నారు. 

అయితే ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ పొందనున్న ఎన్ఠీఆర్ ఆపై రాబోయే తన చిత్రాల రీచ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండాలనే టార్గెట్ తో కథలు, కాంబినేషన్ల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆల్ రెడీ కొరటాల శివ సినిమాని, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు స్క్రిప్ట్ నీ ఓకే చేసిన తారక్ K G F డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చెయ్యనున్నారు. ఈ మూడే కాదండోయ్... తారక్ బర్త్ డే అయిన మే 20 న మరో రెండు సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ కానున్నాయి. సో.. త్వరలోనే తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవడం ఖాయం. వాళ్లలో రెట్టించిన జోష్ రావడం తధ్యం.!

Fans eagerly waiting for Tarak film announcement:

Jr.Ntr Upcoming movies Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs