Advertisement
Google Ads BL

పుష్పపై విరుచుకుపడి విమర్శలు


సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై ఆలోచింపజేసే ప్రసంగాలతో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన అవధాని గరికపాటి నరసింహారావు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన చిత్రం పుష్ప. ఆ అవధానికీ ఈ సినిమాకీ ఏ సంబంధం లేకపోయినా ఓ ముఖాముఖి కార్యక్రమంలో తన అభిప్రాయ వ్యక్తీకరణ పేరుతో పుష్పపై విరుచుకుపడి విమర్శలు చేశారు గరికపాటి నరసింహారావు. ఆయన ఏమన్నారంటే...

Advertisement
CJ Advs

సమాజంపై, నేటి యువతరంపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయో మీ అందరికీ తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్న కాక మొన్న పుష్ప.. ఇలాంటివి వస్తున్నాయి. పుష్పలో హీరో ఎవరండీ.. ఓ స్మగ్లర్. స్మగ్లర్ ని హీరోని చేస్తారా.? తర్వాత ఎప్పుడో పుష్ప 2  అనీ పువ్వు 3  అనీ తీసి చివరి 5 నిమిషాలూ మంచి చూపిస్తాం అంటే అప్పటివరకూ సొసైటీ చెడిపోవాలా.? అసలు ఓ స్మగ్లర్ తగ్గేదేలే అనడం ఏమిటి.? వాడేమైనా సత్య హరిశ్చంద్రుడా, శ్రీ రామచంద్రుడా.? రేపు తప్పుడు పనులు చేసేసి పిల్లలు కూడా ఈ డైలాగ్ వాడరూ.! ఆ సినిమా డైరెక్టర్ ని కానీ, హీరోని కానీ నాకు సమాధానం చెప్పమనండి. కడిగేస్తాను వాళ్ళని అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు గరికపాటి. 

మరి మన లెక్కల మాస్టారు సుక్కు దీనికి వివరణ ఇస్తారా...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గరికపాటి చురకలపై స్పందిస్తారా...??

Sensational Satires On Pushpa :

Garikapati Comments About Pushpa 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs