Advertisement
Google Ads BL

ఈ జంట కూడా విడిపోయిందంట.!


ప్రస్తుతం బాలీవుడ్ దగ్గరనుండి, కోలీవుడ్, టాలీవుడ్ వరకు సెలబ్రిటీస్ విడాకుల ట్రెండ్ నడుస్తుంది. బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ళ అనుబంధానికి అమీర్ ఖాన్ గుడ్ బై చెప్పారు. ఆయన తన భార్య తో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య - సమంత విడిపోవడం ఇప్పటికి షాకింగ్ విషయమే. అలాగే రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ కపుల్.. వారు కూడా ఎన్నో ఏళ్ళ అనుబంధానికి విడాకుల తో ఫుల్ స్టాప్ పెట్టారు. ధనుష్ - రజిని డాటర్ ఐశ్వర్య విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు అదే కోవలో మరో సెలెబ్రిటీ కపుల్ కూడా విడిపోబోతుంది అని తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

అదే జెడి చక్రవర్తి - అనుకృతి గోవింద్ శర్మ. వీరు కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని అంటున్నారు. జెడి చక్రవర్తి రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా పాపులర్ అయిన నటుడు. ఆయన హీరోగానూ, విలన్ గానూ అనేక సినిమాలు చేసారు. నాగ చైతన్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీ జోష్ లోను ఆయన విలన్ గా నటించారు. కెరీర్ లో పడి చక్రవర్తి చాలా లేటు వయసులో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి కూడా బ్రేక్ అయ్యింది అని అంటున్నారు. త్వరలోనే జెడి చక్రవర్తి - అనుకృతి గోవింద్ శర్మ విడిపోయి విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. సమంత - నాగ చైతన్య, ధనుష్ - ఐశ్వర్య ల జాబితాలో ఇప్పుడు మరో కొత్త జంట చేరింది. 

The couple also broke up.!:

JD Chakravarthy to Separate from His Wife!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs