Advertisement
Google Ads BL

శరత్ కి మెగా ఫ్యామిలీకి లింక్ తెగిపోయిందా


శరత్ మరార్ అంటే ఒకప్పుడు మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గరగా వున్న వ్యక్తి. పవన్ కళ్యానికి ఎన్నో సంవత్సరాల పాటు అతి దగ్గరగా అంటే శరత్ మరార్ కి తెలియకుండా ఏమి జరిగేది కాదు. అంత దగ్గరగా వున్నవ్యక్తి. అలాంటి శరత్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ తో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తాను కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మాణం చేసుకుంటూ, లేదా వేరే వాళ్ళతో కలిసి చిన్న సినిమాలు నిర్మాణం చేసుకుంటూ తన పనేదో తాను చేసుకుంటున్నారు. తాను చేస్తున్న ఫంక్షన్స్ కి మెగా ఫ్యామిలీ నుండి ఎవరిని కూడా పిలవటం లేదు. పవన్ కళ్యాణ్ కి అంత దగ్గరగా వున్న శరత్ ఇప్పుడు ఎందుకు అంత దూరం అయ్యారు.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా కూడా చేసిన శరత్ ఇప్పుడు ఎందుకు చాలా లో ప్రొఫైల్ లో వున్నారు. రీసెంట్ గా జరిగిన వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో రాధికా గారు శరత్ ని చిరంజీవి గారితో చాలాసార్లు చూసాను అన్నారు, అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యామిలీతో లింక్ పూర్తిగా తెంచేసుకున్నారు. ఎందుకు? కొంతమంది అనటం, పవన్ కళ్యాణ్ శరత్ కి కొంత డబ్బు ఇచ్చి, తనకి ఏది నచ్చితే అది నిర్మాణం చేసుకోమని చెప్పారని అంటున్నారు. అందుకే శరత్ చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ చేసుకుంటూ కనిపిస్తున్నారు అని సమాచారం.

Is the link to Sarath Marar Mega Family cut off?:

Sharath Marar new web series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs