Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ తో పెళ్లా..


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది. వీరిద్దరూ కలిసి అంతరిక్షం, మిస్టర్ మూవీస్ లో కలిసి నటించడంతో.. ఈ రూమర్స్ కి బాగా ఊతమిచ్చాయి. ఇక తన చెల్లి నిహారిక పెళ్ళికి లావణ్యని వరుణ్ తేజ్ స్పెషల్ గా ఇన్వైట్ చెయ్యడంతో.. నిజంగానే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ తన బర్త్ డే రోజున హైదరాబాద్ నుండి ఎక్కడికో వెళ్ళాడు. అది లావణ్య త్రిపాఠి దగ్గరకే వెళ్లాడని, పెళ్లి చేసుకుందామని లావణ్యకి ప్రపోజ్ చేసాడనే ప్రచారం షురూ అయ్యింది. 

Advertisement
CJ Advs

కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తాను డెహ్రాడూన్ లో తన తల్లితండ్రులతో ఉన్నట్టుగా ఓ పిక్ షేర్ చేసి ఆ రూమర్స్ కి చెక్ చెప్పింది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఆ సమయంలో చాలామంది లావణ్యని వరుణ్ తో ప్రేమ, పెళ్లి విషయమై ప్రశ్నించారు. దానితో ఆమె సమాధానము ఇస్తూ.. అసలు తన పెళ్లి ఎవరితో జరుగుతుందో అనే విషయం తనకే తెలియదని.. తనకే తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందోనని చెప్పుకొచ్చింది. మరి మీరు ఎవరితోనూ ప్రేమలో లేరా.. అని మరోసారి ఆమెని రెట్టించగా.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కామ్ గా ఉండిపోయింది.  

Lavanya Tripathi Finally Opens on her Marriage:

First Response! Lavanya Tripathi about her marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs