Advertisement
Google Ads BL

రవితేజ స్పీడు మాములుగా లేదు


మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఖిలాడీ మూవీ ఈ నెల 11 న కానీ 18 న కానీ రిలీజ్ అంటుండగా, ఆయన తదుపరి చిత్రం రామారావు ఆన్ డ్యూటీకి రెండు డేట్స్ ఇచ్చారు. మార్చ్ 25 కానీ లేదంటే ఏప్రిల్ 15 కానీ ఆ సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇక రవితేజ తన నెక్స్ట్ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రావణాసుర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. నేడు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో మాస్ మహారాజ ర‌వితేజ‌ పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఫస్ట్ డే.. రావణాసుర.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంటూ రవితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు యూనిట్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో దర్శకుడు సుధీర్ వర్మ, ఫరియా అబ్దుల్లా, నిర్మాత అభిషేక్ నామా, రైటర్ శ్రీకాంత్ విస్సా, సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఉన్నారు.

రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదుగురిలో ప్రతీ ఒక్క పాత్రకు ప్రాముఖ్యత ఉండ‌నుంది.

Ravi Teja Joins Shoot Of Ravanasura Today:

<span>Hero Ravi Teja Joins Shoot Of Sudheer Varma, Abhishek Nama Ravanasura Today</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs