Advertisement
Google Ads BL

అజిత్ వాలిమై రాకకు రంగం సిద్ధం


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా వాలిమై ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాల్సింది. అయితే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న భారీ సినిమాలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదాలు పడ్డాయి. ప్రస్తుతం కరోనా శాంతించి సానుకూల వాతావరణం ఏర్పడటంతో అజిత్ వాలిమై ని ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసారు.

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో వాలిమై ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసాము. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే  గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం  ఉంటుంది. తెలుగులో ఖాకిగా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా థీరన్ అధిగారం ఒండ్ర సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది.  

అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు.  ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత  ఆడియ‌న్స్‌కు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా,  అయన తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు అన్నారు.    

 

Valimai Release Date Announcement:

Ajith Valimai Release to be reelased on Feb 24th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs