Advertisement
Google Ads BL

సమ్మర్ రేస్ లోకి మోహన్ బాబు ఎంట్రీ


సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకుని.. రిలీజ్ కి రెడీ అయినప్పటికీ కరోనా పాండమిక్ సిట్యువేషన్ తో వాయిదాలు వేసుకున్న బిగ్ బడ్జెట్ మూవీస్, మీడియం బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాలు అన్ని మళ్ళీ రిలీజ్ డేట్స్ ఇస్తూ.. హడావిడి చెయ్యడంతో టాలీవుడ్ లో సినిమాల జాతర మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ దగ్గర నుండి రాధేశ్యామ్ వరకు సినిమాల రిలీజ్ డేట్స్ రావడంతో ఫాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. ఇక మంచు మోహన్ బాబు కూడా ఈ సమ్మర్ రేస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆయన నటించిన సన్ అఫ్ ఇండియా షూటింఫ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం గా ఉంది. తాజాగా మేకర్స్ సన్ అఫ్ ఇండియా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Advertisement
CJ Advs

ఫిబ్రవరి 18 న మంచు మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా రిలీజ్ అవుతుంది అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు. గత ఏడాది చిరు చేతుల మీదుగా సన్ అఫ్ ఇండియా టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై మంచి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసింది. మోహన్ బాబు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సోషల్ మెసేజ్ తో పాటుగా పొలిటికల్ సెటైర్స్, కాన్ టెంపరరీ ఇష్యుస్ మీద పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా తో పాటుగా రవి తేజ ఖిలాడీ కూడా ఫిబ్రవరి 18 నే రిలీజ్ అవ్వబోతుంది. ఫిబ్రవరి 11 న రిలీజ్ అవ్వాల్సిన రవితేజ ఖిలాడీ మూవీ కొన్ని కారణాల వలన 18 కి పోస్ట్ పోన్ అయ్యింది. 

Mohan Babu Son of India set for release:

<span>Mohan Babu Son of India release date fix</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs