Advertisement
Google Ads BL

సమంత, నయన్ ని తెగ పొగిడేసిందే..


చైతు తో డివోర్స్ తర్వాత సమంత వ్యవహారం వేరే లెవెల్ అన్నట్టుగా మారిపోయింది. కెరీర్ లో ఇంతవరకు చెయ్యని పని చేస్తుంది సమంత. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సీరీస్ అంటూ సమంత కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి ఉంది. ఇక నయనతార కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్తో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇలాంటి టాలెంటెడ్ బ్యూటీస్ పై ఇప్పుడొక నటి పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో అదరగొట్టేసింది, నారప్ప సినిమాతో ఆకట్టుకుంది. తాజాగా భామ కలాపం వెబ్ సీరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రియమణి. 

Advertisement
CJ Advs

ఆ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియామణి.. ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని, ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం హీరోల పక్కన గ్లామర్ ఒలకబొయ్యడానికి, రొమాన్స్ చెయ్యడానికే ఉండేవారని, కానీ ఈ తరం హీరోయిన్స్ కి విమెన్ సెంట్రిక్ మూవీస్ అవకాశాలు వస్తున్నాయని..  సమంత, నయనతార లను ఓ రేంజ్ లో పొగిడేసింది. నయనతార ఓ పక్కన విజయ్, రజినీకాంత్ లాంటి స్టార్స్ సినిమాలు చేస్తూనే.. మరోపక్క విమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదరగొట్టేస్తుంది అని, అలాగే సమంత అయితే ఇండస్ట్రీలోని మూస పద్ధతులకి ఫుల్ స్టాప్ పెట్టి అన్ని రకాల పాత్రలు చేస్తుంది. 

ఈ మధ్యన సమంత పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావ ఐటెం సాంగ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ లో సమంత చాలా హాట్ గా కనిపించింది. నా హస్బెండ్ కూడా అదే మాట చెప్పారు. ఇలాంటి ఓ స్పెషల్ సాంగ్ చేసిన సమంత కి ముందు హ్యాట్సాఫ్ చెప్పాలి అని అంటూ ప్రియమణి నయనతార, సమంత లని పొగిడేసింది. 

Priyamani showers praises on Samantha and Nayanthara:

Priyamani Lauds Sam and Nayan For Doing Powerful Women
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs