యాంకర్ మరియు యాక్ట్రెస్ అయిన అనసూయ ఖిలాడీ సినిమాలో చంద్రకళ అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. అనసూయ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ కాదు అత్తగారుగా వేస్తోంది అని సమాచారం. రంగస్థలం లో రంగమ్మ అత్తగా వేసిన అనసూయ, ఇందులో కూడా అత్త గానే వేస్తోందని, అయితే ఇందులో ఆమె రోల్ రంగస్థలం లో రంగమ్మ అత్త కన్నా మరింత డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు. ఇద్దరు కథా నాయికల్లో ఒకరికి తల్లిగా హీరో రవితేజకి అత్తగా అనసూయ నటిస్తుందట.
అత్తగానే కానీ.. అనసూయ డ్యూయల్ రోల్ మాత్రం లేదని చెప్తున్నారు. పుష్ప సినిమా తరువాత అనసూయ చేసిన సినిమా ఈ ఖిలాడీ ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. రవి తేజ కథానాయకుడు గా వస్తున్న ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకుడు కాగా, దింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.