Advertisement
Google Ads BL

వోడ్కా టైంలో బన్నీ - కాఫీ టైంలో పవన్


ఆ మధ్యన మెగా ఫ్యామిలిలో మెగాస్టార్ తర్వాత అల్లు అర్జున్ మెగాస్టార్ అని, పుష్ప సినిమా తో మొదటి పాన్ ఇండియా మూవీ చేసిన అల్లు అర్జున్ మెగాస్టార్ కాక ఇంకేం అవుతాడు, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దిక్కు అంటూ కాంట్రవర్సీకి తెర లేపిన కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ కి ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీరు పాన్ ఇండియా స్టార్ ఎందుకు కాకూడదు.. అంటూ ఆ ట్వీట్స్ మొదలు పెట్టాడు ఆయన. వోడ్కా తాగి అల్లు అర్జున్ పై ట్వీట్స్ చేసిన నేను.. ఇప్పుడు కాఫీ తాగుతూ మీ కోసం ట్వీట్స్ చేస్తున్నాను అంటూ.. 

Advertisement
CJ Advs

@pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి.

@allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి.

పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము.

ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999, @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం  మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి.

ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???

Bunny on vodka time, Pawan on coffee time:

Ram Gopal Varma sensational tweet on Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs