ప్రభాస్ సలార్ గురించిన అప్ డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ కొత్త షెడ్యూల్ అతి త్వరలో మొదలు కాబోతుంది. ఇక సలార్ రెండు పార్ట్ లు గా రిలీజ్ కాబోతుంది అని ఓ న్యూస్, తర్వాత ప్రభాస్ సలార్ పిక్ ఒకటి సోషల్ మీడియా లీక్ అవడం, ఆ తర్వాత తాజాగా మరొక న్యూస్ సలార్ పై సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. సలార్ లీకెడ్ పిక్ లో ప్రభాస్ పక్కా మాస్ హీరోగా చాల రఫ్ గా కనబడుతున్నాడు. ఈ సినిమాని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలే హైలెట్ అవుతాయని, కెజిఎఫ్ కి మించి సలార్ ఉండబోతుంది అంటున్నారు.
అయితే ఇప్పుడు సలార్ యాక్షన్ క్లైమాక్స్ సన్నివేశానికి మేకర్స్ ఏకంగా 75 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. సలార్ లో క్లైమాక్స్ సన్నివేశం సూపర్ హైలెట్ అవుతుంది అని, ప్రభాస్ కి విలన్స్ కి మధ్యన జరిగే ఈ యాక్షన్ సన్నివేశానికి భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందట. ప్రశాంత్ నీల్ పై నమ్మకంతో మేకర్స్ కూడా వెనక్కి తగ్గడం లేదట. హీరోయిన్ శృతి హాసన్ కూడా ప్రభాస్ తో పాటుగా ఈ క్లయిమాక్స్ లో కీలకం కాబోతుంది అని తెలుస్తుంది. మరి క్లైమాక్స్ కోసమే 75 కోట్లు అంటే సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అప్పుడే ప్రభాస్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యిపోతున్నారు.