Advertisement
Google Ads BL

2 న అప్ డేట్.. 7 న ఓపెనింగ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో మొదలు కాబోయే NTR30 ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఫిబ్రవరి నుండి NTR30 మొదలు కాబోతుంది అనే న్యూస్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఇలా ట్రెండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే ఎన్టీఆర్ - కొరటాల కాంబో అప్ డేట్ ని ఓ స్పెషల్ డేట్ కి ఇవ్వబోతున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఫిబ్రవరి2 అంటే 2-2-22 న NTR30 నుండి అప్ డేట్ రాబోతుంది. అయితే ఆ అప్ డేట్ ఏమిటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది NTR30 ఫిబ్రవరి 7 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అంటున్నారు.

Advertisement
CJ Advs

అటు కొరటాల శివ కి ఆచార్య విడుదల ఆలస్యం జరగడం, ఇటు ఎన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండడంతో .. ఈలోపు పూజా కార్యక్రమాలతో NTR30 ని మొదలు పెట్టెయ్యాలనుకుంటున్నారట. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెగ్యులర్ షూట్ కూడా మొదలు పెడతారని, ఫిబ్రవరి 2 వ తారీఖున NTR30 ఓపెనింగ్ అప్ డేట్ తో పాటుగా.. ఆ సినిమాలో నటించబోయే నటుల వివరాలు కూడా ఇవ్వబోతున్నారు మేకర్స్.. అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కియారా అద్వానీ కానీ, అలియా భట్ కానీ రొమాన్స్ చేసే అవకాశం ఉంది అని, ఎక్కువశాతం కియారా నే NTR30 హీరోయిన్ అని టాక్. చూద్దాం ఫైనల్ గా ఎన్టీఆర్ సరసన ఎవరు ఉంటారో అనేది. ఇక NTR30 ని కొరటాల వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే 2023 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.

NTR30 to be launched on Feb 7? :

NTR30 to launch date fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs