Advertisement
Google Ads BL

కామెడీ చేస్తున్న జబర్దస్త్ జెడ్జెస్


జబర్దస్త్ లో మెయిన్ కమెడియన్స్ తప్ప చాలామంది జబర్దస్త్ ని వదిలేసారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు తప్ప జబర్దస్త్ లో పేరున్న కమెడియన్స్ కనిపించడం లేదు. భాస్కర్, చంటి, సుధాకర్, షేకింగ్ శేషు, కార్తీక్.. ఇలా కొంతమందితోనే జబర్దస్త్ నడుస్తుంది. స్కిట్స్ కూడా చాలా కుదించేశారు. మధ్యలో సీరియల్స్ నటులు హడావిడి.. ఇలా ఏదో నడిచిపోతుంది జబర్దస్త్, ఇక జబర్దస్త్ కోసం ఈసారి జెడ్జెస్ కూడా రంగంలోకి దిగారు. జబర్దస్త్ టీఆర్పీ పడిపోతుంది అనో, లేదంటే.. స్కిట్స్ లో కమెడియన్స్ లేకో కానీ.. రోజా, మనో లు స్కిట్స్ లో పార్టిసిపేట్ చేసారు.

Advertisement
CJ Advs

ఈ శుక్రవారం జరిగిన ఎక్స్ట్రా జబర్దస్త్ లో జేడ్జ్ రోజా - సుధీర్ ఓ స్పెషల్ స్కిట్ చేసారు. సుధీర్ కి తల్లిగా రోజా యాక్ట్ చేసింది. కొడుకు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే తల్లిగా రోజా చెప్పిన డైలాగ్స్ కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ఇక మనో అయితే రాకింగ్ రాకేష్ స్కిట్ లోకి వచ్చి ఆడవాళ్ళ గొప్పదనం గురించి ధారాళంగా మాట్లాడేశారు. రోజా అ ఆ ల దగ్గరే ఆగిపోతే హీరోయిన్ అయ్యేది కాదని, ఎబిసిడీల దగ్గర ఆగిపోతే ఎమ్యెల్యే అయ్యేది కాదు అని, వైజాగ్ నుండి వచ్చి తెలుగు రాకపోయినా యాంకర్ అయ్యింది రష్మీ అని, గుంటూరు మిర్చి తో గుంటూరు వెళ్ళింది అంటూ మనో.. రాకేష్ స్కిట్ లో పెర్ఫార్మ్ చేసారు. మరి రోజా, మనో కూడా స్కిట్స్ చేసారంటే.. స్కిట్స్ తక్కువై ఉంటాయి అందుకే ఇలా అంటున్నారు. పాపం కమెడియన్స్ లేకపోయేసరికి జెడ్జెస్ కూడా స్కిట్స్ చేసుకోవాల్సి వస్తుంది అంటున్నారు నెటిజెన్స్.

Jabardasth Judges doing comedy:

Sudigali Sudheer and Roja Special Skit Performance  in Extra jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs