Advertisement
Google Ads BL

టైగర్ నాగేశ్వర రావు వెనక అసలు కథ ఇదీ


టైగర్ నాగేశ్వర రావు అనే పాత కాలపు దొంగ కథ ఇప్పుడు రవి తేజ చేస్తున్నారు. వంశీ దర్శకత్వం చేస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అయితే ఈ కథ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ చెయ్యాల్సి ఉంది. వంశీ మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాక, బెల్లంకొండ కి వినిపించాడు. అభిషేక్ అగర్వాల్ బెల్లంకొండకి రెండు కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే శ్రీనివాస్ వేరే సినిమా చెయ్యాలి అని చెప్పి, ఈ టైగర్ కథ చాలా నెలలు దాటేశాడు. నిర్మాత దర్శకుడు కలిసినప్పుడల్లా చేద్దాం చేద్దాం అంటాడే తప్ప పట్టాలెక్కిన దాఖలాలు  లేవు. ఇలా చాలా కాలం తిరిగిన, నిర్మాత దర్శకుడు ఇంకా లాభం లేదని, అతను చెయ్యడని తెలిసి, రవి తేజ కి కథని వినిపించారు. రవి తేజ కి నచ్చి వెంటనే చేద్దాం అన్నాడు. నిర్మాత బెల్లంకొండ దగ్గరికి వెళ్లి, తన అడ్వాన్స్ తిరిగి ఇచ్చెయ్యమని అడిగితే, శ్రీనివాస్ ఇప్పుడు రండి సినిమా స్టార్ట్ చేసేద్దాం అన్నాడు. 

Advertisement
CJ Advs

అయితే అభిషేక్ తాను రవి తేజ తో ఈ సినిమా చేస్తున్నా అని, శ్రీనివాస్ తో చెయ్యనని తెగేసి చెప్పి, అడ్వాన్స్ ఇచ్చెయ్యమన్నాడు. తనతో చేస్తా అని చెప్పి, ఆ కథ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తో హర్ట్ అయిన బెల్లంకొండ అడ్వాన్స్ ఇచ్చేది లేదు, తాను కూడా అదే సినిమా చేస్తా అన్నాడు. టైగర్ నాగేశ్వర రావు అనే అతను పబ్లిక్ పర్సన్, ఎవరయినా తీసుకోవచ్చు అని చెప్పాడు. అదీ కాకుండా, స్క్రిప్ట్ అంతా తనకి గుర్తు ఉందని, వేరే వాళ్ళతో ఎలా తీస్తారు అని చెప్పాడు. అయినా కూడా అభిషేక్ అగర్వాల్ ఒప్పుకోలేదు, తాను రవితేజ కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసా అన్నాడు. ఇది ఇలా ఉంటే, బెల్లంకొండ ఒక పోస్టర్ కూడా విడుదల చేసేసాడు. అందులో డీటెయిల్స్ ఏమి లేకపోయినా, తాను చేస్తున్నట్టు పోస్టర్ వస్తే, రవి తేజ తప్పుకుంటాడు అని అలా చేసాడు.

కానీ రవితేజ ఇవేమి పట్టించుకోకుండా, అభిషేక్ ని షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం అభిషేక్ హైదరాబాద్ శివార్ల లో ఒక పెద్ద సెట్ కూడా వేస్తున్నాడు. పీరియడ్ డ్రామా కాబట్టి, దీనికి అప్పట్లో రోడ్స్, ఇల్లు ఎలా ఉండేవో అలానే వేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు కి ఒక సిస్టర్ ఉందని, ఆమెది సినిమాలో చాలా కీలక పాత్ర అని తెలుస్తుంది. ఆ రోల్ కోసం రేణు దేశాయ్ ని అప్రోచ్ అవుతున్నట్టు సమాచారం. అలాగే ఇందులో రవితేజ కు ముగ్గురు కథ నాయికలను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

This is the real story behind Tiger Nageswara Rao:

Ravi Teja announces his first pan Indian film Tiger Nageshwara Rao
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs