ప్రభాస్ - పూజ హెగ్దే కాంబోలో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీకి శకునాలు బాలేదు. ఎప్పుడో మొదలైన ఈ మూవీ రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఎలాగో సంక్రాంతికి రావాలని గట్టిగా ఫిక్స్ అయితే కరోనా మహమ్మారి మాత్రం మీరు తగ్గాల్సిందే అంది. దానితో రాధే శ్యామ్ వెనక్కి తగ్గింది. అయితే మళ్ళీ రాధే శ్యామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రభాస్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా కామ్ గానే ఉన్నారు. ఈలోపు రాధే శ్యామ్ ఓటిటి బాట పట్టబోతోంది అనగానే దర్శకుడు రాధా కృష్ణ రాధే శ్యామ్ థియేటర్స్ లోనే విడుదల అని స్పష్టత ఇచ్చారు.
తాజాగా ఆర్.ఆర్.ఆర్ మూవీ మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దానితో రాధేశ్యామ్ మార్చ్ 4 న విడుదలకు సిద్దమవుతుంది లేదా ఆర్.ఆర్.ఆర్ తప్పుకుంటే మార్చ్ 18 కి ఖాయం అంటున్నారు. రెండు మూడు రోజుల్లో రాధే శ్యామ్ రిలీజ్ డేట్ పై స్పష్టత రాబోతుంది అని, మోస్ట్లీ మార్చ్ 4 నే రాధే శ్యామ్ రిలీజ్ ఉంటుంది అంటున్నారు. మరి ఫిబ్రవరి అంతా రాధేశ్యామ్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతుందేమో చూడాలి.