Advertisement
Google Ads BL

కొత్తదనం కోరుకుంటున్న బాలీవుడ్


బాలీవుడ్ కొత్తదనం కోరుకుంటుంది.. ఈమాటన్నది ఎవరో కాదు.. బాలీవుడ్ విశ్లేష‌కుడు కమాల్ ఆర్ ఖాన్. ఎందుకంటే టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాయని, తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసుని బద్దలు కొట్టడం చూసిన కమల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ హీరోలపై, బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. పుష్ప సినిమా హిందీ బాక్సాఫీసు దగ్గర డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అయ్యి 100 కోట్ల బిజినెస్ చేసింది అని, ఇలాంటి గొప్ప సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆయన బాలీవుడ్ హీరోలపై కామెంట్స్ చెయ్యడం వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

తెలుగు హీరోలు యాక్షన్ తో బాలీవుడ్ ప్రేక్షకులని పడేస్తున్నారు. ప్రభాస్ బాహుబలి, సాహో, ఇప్పుడు పుష్ప సినిమాలే అందుకు ఉదాహరణ. అందుకే పుష్ప సక్సెస్ ని చూసిన కమల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ హీరోలకి ఇదొక లెస్సెన్ అంటున్నాడు. బాలీవుడ్ హీరోలు 25 కోట్లు కలెక్షన్స్ తేవడానికి కష్టపడుతున్న టైం లో ఓ డబ్బింగ్ సినిమా 100 కోట్లు పట్టుకుపోవడం అక్కడి హీరోలకి చెంప పెట్టులాంటిది అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. నిజంగానే బాలీవుడ్ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారేమో.. అందుకే తెలుగు హీరోలని బాగా ఆదరిస్తున్నారు. ఇక్కడి వాళ్ళ యాక్షన్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.. కాబట్టే యూట్యూబ్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలకు మంచి లైక్స్ ఇస్తున్నారు.

Bollywood wants something new:

Pushpa is a slap on the face of Bollywood stars: Kamal R Khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs