రవి తేజ ఇప్పుడు వరస సినిమాలతో చాలా బిజీ గా వున్నారని అందరికి తెలిసిన విషయమే. ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ కూడా చేసేస్తున్నాడు రవి తేజ. బర్త్ డే రోజున రవి తేజ అప్ డేట్స్ చూసిన యంగ్ హీరోస్ కూడా షాక్ అయ్యారు. ఆ వరస క్రమంలోనే టైగర్ నాగేశ్వర రావు సినిమా షూటింగ్ కూడా చేసేద్దామని అనుకుంటున్నాడు రవి తేజ. అభిషేక్ అగర్వాల్ దీనికి నిర్మాత వంశి కృష్ణ దర్శకుడు. టైగర్ నాగేశ్వర రావు అనే ఈ వివాదాస్పద సినిమా మరియు కథ రవి తేజ కి బాగా నచ్చిందని, అందువల్ల ఈ సినిమా కూడా తొందరగా షూటింగ్ చేద్దామని అన్నాడు అని సమాచారం.
అయితే ఇందులో టైగర్ నాగేశ్వర రావు కి ఒక సిస్టర్ వుంది, ఆ రోల్ కోసం సినిమా దర్శకుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని అప్రోచ్ అయినట్టు భోగట్టా. ఒకవేళ రేణు దేశాయ్ కనక ఒప్పుకుంటే, ఈ సినిమా కి మంచి హైప్ వస్తుందని ఈ సినిమా టీం అభిప్రాయం. అలాగే రవి తేజ పక్కన ముగ్గురు కథానాయికలు ఉంటారని కూడా తెలిసింది. ఇది ఒక పీరియడ్ డ్రామా, అరవయ్యో దశకంలో జరిగిన కథ. అయితే రవి తేజ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాబిన్ హుడ్ తరహాలో తీర్చి దిద్దారని సమాచారం.