Advertisement
Google Ads BL

యూట్యూబ్ ఛానల్స్ పై విరుచుకుపడిన నటి


బిగ్ బాస్ కి వెళ్ళకముందు సీరియల్స్ తోనూ, కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ కేరెక్టర్స్ లో నటించిన హిమజ.. బిగ్ బాస్ కి వెళ్ళాక సినిమాల్లో కన్నా ఎక్కువగా యూట్యూబ్ లోనే కనబడుతుంది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక వచ్చిన క్రేజ్ తో హిమజ సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టి.. హోమ్ టూర్, కిచెన్ టూర్, విలేజ్ టూర్, షాపింగ్ టూర్ అంటూ అబ్బో రోజుకో టూర్ చేస్తుంది. అలాంటి యూట్యూబ్ హిమజ ఇప్పుడు యూటూబ్స్ పై విరుచుకుపడుతుంది. కారణం హిమజ భర్త నుండి విపోతుంది. భర్తకి విడాకులిస్తుంది అంటూ న్యూస్ ప్రచారం లోకి రావడమే. హిమజ కి పెళ్లి జరిగింది అని, విడాకులు కూడా ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

అది చూసిన హిమజ ఇలాంటి వార్తలు రాయడానికి కొంచెమైనా బుద్దుండాలి, ఇంకిత జ్ఞానం ఉండాలి అంటూ ఫైర్ అవుతుంది. అసలు నాకు పెళ్ళయింది అని ఎవరు చెప్పారు, నేను భర్త నుండి విడిపోతున్నాను అని ఎవరు చెప్పారు మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాను షూటింగ్స్ లో బిజీగా ఉండగా.. ఇలాంటి న్యూస్ లింక్స్ కొంతమంది నాకు పంపారు. ఆ లింక్స్ లో నేను నా భర్త తో విడాకులు తీసుకుంటున్నట్లుగా ఉండడంతో.. రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని, తనకి పెళ్లి పై అంతగా నమ్మకం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఘనంగా చేసుకుంటాను అని, ఎమన్నా సంబంధాలు ఉంటే చూడమంటూ హిమజ వెటకారంగా స్పందించింది. 

ప్రస్తుతం తాను పెళ్లి చేసుకొనే మూడ్ లో లేనని, ఓ నాలుగేళ్ళ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని, ఇలాంటి గాసిప్స్ వలన పేరెంట్స్ బాధపడుతున్నారని, నేను కొత్తిల్లు కట్టుకోవడం చూసిన కొంతమంది ఓర్వలేక ఇలాంటి పిచ్చి రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారంటూ హిమజ మండి పడింది. 

Himaja reaction on marriage and divorce news:

Himaja Reaction To The News Of Marriage And Divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs