Advertisement
Google Ads BL

ప్రభాస్ యూరప్ మిస్టరీ


ఈమధ్యన పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఈమధ్యనే యూరప్ వెళ్ళాడు. అక్కడ వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యడానికి వెళ్ళాడు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ విడుదలకి రెడీగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ఫినిష్ చేసి సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ షూటింగ్స్ చెయ్యడానికి ప్రభాస్ రెడీ గా వున్నాడు. అయితే ప్రభాస్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా లో అన్ని వసతులతో కూడిన ఓ విల్లాని కట్టించుకుంటున్నాడు. కోట్లకి కోట్లు పెట్టి ప్రభాస్ ఆ విల్లాని సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ యూరప్ లో కూడా ఓ విల్లాని కోలుగోలు చేసేందుకు ఆసక్తిగా వున్నట్లుగా నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

Advertisement
CJ Advs

ప్రభాస్ ఈమధ్యన విదేశీ ట్రిప్స్ ఎక్కువగా వేస్తున్నాడు. అందులో ఎక్కువగా యూరప్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్ తోనూ, రిలేటివ్స్ తో ఎక్కువగా ప్రభాస్ యూరప్ వెళుతున్నాడు. అందుకే అక్కడ ఓ ఖరీదైన విల్లాని కోలుగోలు చెయ్యాలని ప్రభాస్ చూస్తున్నాడట. యూరప్ కంట్రీస్ లోని ఒక ప్రశాంతమైన బీచ్‌ దగ్గరలో ఉన్న పాతకాలపు విల్లాను కొనుగోలు చేయాలని ప్రభాస్ అక్కడి మీడియేటర్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభాస్ కొనుగోలు చేయాలనుకుంటున్న విల్లా విలువ దాదాపు 300కోట్లకు పైగానే ఉంటుందట. పాత విల్లా ని కొనుగోలు చేసిన తర్వాత ప్రభాస్ దాని కోసం మరింత ఖర్చు చేసి మరికొన్ని చెంజెస్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

మరి కేవలం విల్లా తోనే ప్రభాస్ ఆగడం లేదు. అక్కడ ప్రభాస్ బిజినెస్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. అది కూడా అక్కడి ఆస్తులు అంటే ఇల్లు, స్థలాల మీదే ప్రభాస్ ఇన్వెస్ట్ చెయ్యాలని చూస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అక్కడ యూరప్ లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడంటున్నారు. 

Prabhas secret European plans revealed:

The secret behind Prabhas Europe sojourn
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs