Advertisement
Google Ads BL

బుల్లితెర మీదకి మాధవన్ - ప్రియమణి


కోలీవుడ్ హీరో మాధవన్ - హీరోయిన్ ప్రియమణి ఇప్పుడు బుల్లితెర మీద దడదడ లాడిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా లైట్ తీసుకుని.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో నటించడం, తాజాగా ఆహా ఓటిటి కోసం భామ కలాపం వెబ్ సీరీస్ చెయ్యడమే కాదు, వెంకీ నారప్ప లో నారప్ప భార్యగాను నటించి అదరగొట్టేసింది. ఇక మాధవన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్, హీరో గా, వెబ్ సీరీస్ ల్లోనూ నటించేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు టాటా స్కై కోసం కలిసిపోయి బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. టాటా స్కై ఇప్పుడు టాటా ప్లే గా మారిపోయింది అంటూ టాటా స్కై యాడ్స్ లో నటించేసారు. 

Advertisement
CJ Advs

గత రెండు రోజులుగా ఈ టాటా స్కై ని టాటా ప్లే గా మార్చామంటూ ప్రియమణి - మాధవన్ లు కనిపించిన మూడు నాలుగు యాడ్స్ వరసగా ఛానల్స్ లో ప్రత్యక్షయ్యాయి. టాటా స్కై నుండి టాటా ప్లే అంటూ ప్రేక్షకులు పలికేవరకు ఊరుకునేలా లేరు. అన్ని రకాల యాడ్స్ తో ప్రేక్షకులని ఒప్పించేస్తున్నారు. ఒక యాడ్ లో మాధవన్ - ప్రియమణి లెక్చరర్స్ గా కనబడితే, ఇంకో టాటా యాడ్ లో సూపర్ మార్కెట్ ఓనర్ గా మాధవన్, ప్రియమణి కష్టమర్ గా కనబడ్డారు. మరో యాడ్ లో ఓ సంపన్నుల ఇంట్లో మాధవన్ డ్రైవర్ గాను, ప్రియమణి పని అమ్మాయిగాను కనబడుతూ టాటా ప్లే ని సౌత్ మర్కెట్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఏ ఛానల్స్ లో చూసినా ముందు టాటా ప్లే యాడ్ ప్రత్యక్షమవుతుంది. 

Tata Sky is now officially Tata Play:

R Madhavan and Priyamani will be the face of the campaign TATA Sky
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs