యాంకర్ అనసూయ జబర్దస్త్ అందాలు ఇప్పుడు బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద వెలిగిపోతున్నాయి. ప్రతి గురువారం జబర్దస్త్ స్టేజ్ పై, సోషల్ మీడియాలో కనిపించే అనసూయ.. వెండితెర మీద కూడా ప్రత్యేకమైన పాత్రలతో, పేర్లతో గుర్తింపు తెచ్చుకుంటుంది. రంగస్థలం లో రంగమ్మత్త గా బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికి బయట రంగమ్మత్తగా అనసూయ పిలిపించుకుంటూనే ఉంటుంది. ఇక పాన్ ఇండియా ఫిలిం పుష్ప లోను డిఫ్రెంట్ గా దాక్షాయణి కేరెక్టర్ లో కనిపించింది. అక్కడ కేరెక్టర్ కన్నా దాక్షాయణి పేరు బాగా హైలెట్ అయ్యింది.
పాత్రల పేరులతోనే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకునే పాత్రలని చేస్తున్న అనసూయ ఇప్పుడు రవితేజ ఖిలాడీ సినిమాలో చంద్ర కళ పాత్ర చేస్తుంది. ఈ చంద్ర కళ పాత్ర కూడా అనసూయకి స్పెషల్ ఐడెంటిటీ తీసుకొచ్చే కేరెక్టర్. ఈ చంద్రకళ పాత్రలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తుంది. అంటే రవి తేజ తో పోటీపడే పాత్ర అంటున్నారు. మరి రంగమ్మత్త, దాక్షాయణి లా అనసూయ కి మరోసారి అంత పవర్ ఫుల్ పాత్ర ఖిలాడీలోనే పడింది అంటున్నారు. ఈ సినిమా తర్వాత అనసూయ ని అందరూ చంద్రకళ అని పిలిచినా పిలవొచ్చు.. అంతలా ఆ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 న రిలీజ్ కి రెడీ అవుతుంది.