Advertisement
Google Ads BL

తెలుగు తెరపై వెలిగిపోయే టైమొచ్చింది


అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు ఎప్పటి నుండో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అది ఇప్పటివరకు సాధ్య పడలేదు. బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో బికినీ షోస్, గ్లామర్ షో చేసే జాన్వీ కపూర్ అందాలు సౌత్ కి ఎప్పుడు దిగుమతి అవుతాయా అని సౌత్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అనడమే కానీ.. ఇంతవరకు ఆ జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఒప్పుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు జాన్వీ కపూర్ ని తెలుగులో దింపేందుకు పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ రెడీ అయ్యారట. అంటే విజయ్ - పూరి తదుపరి మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ అనే వార్తలొస్తున్నాయి. మరోపక్క NTR30 లో జాన్వీ కపూర్ హీరయిన్ గా ఫైనల్ అంటున్నారు.

Advertisement
CJ Advs

యంగ్ టైగర్ - మైత్రి మూవీ మేకర్స్ - ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో అతి త్వరలోనే మొదలు కాబోయే NTR30 పాన్ ఇండియా ఫిలిం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అంట. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి జాన్వీ కపూర్, బోని కపూర్ తో చర్చలు జరిపి ఆల్ మోస్ట్ ఓకె చేయించినట్టుగా  సమాచారం. NTR30 అంటే అటు ఇటుగా ఫిబ్రవరిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోవచ్చు. అంటే విజయ్ దేవరకొండ - ఎన్టీఆర్ సినిమా ల్లో ముందుగా ఎన్టీఆర్ సినిమాతోనే జాన్వీ సౌత్ ఎంట్రీ జరిగిపోతుంది. విజయ్ దేవరకొండ- పూరి లైగర్ రిలీజ్ చెయ్యాలి. దేవరకొండ తదుపరి కమిట్మెంట్స్ పూర్తవ్వాలి.. అప్పుడు పూరి - విజయ్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కలి. అందుకే విజయ్ తో ముందుగా కమిట్ అయినా.. ఎన్టీఆర్ మూవీ ముందు పూర్తి చేసి.. టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్.

Janhvi Kapoor Tollywood Entry Fix:

Young tiger NTR to Romance Janhvi Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs