బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన అఖండ నిజంగానే హ్యాట్రిక్ కొట్టింది. లెజెండ్, సింహ సినిమాలని మించి హిట్ అయ్యింది. బాలకృష్ణ నట విశ్వరూపానికి మాస్ ఆడియన్స్ జై జై లు పలికారు. థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ కి ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ కి అఖండమైన ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఎక్కడ చూసినా అఖండ నామ స్మరణే అన్నట్టుగా 103 థియేటర్స్ లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుని నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు.. హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మూవీ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి తెచ్చిపెట్టింది. ఎక్కడ చూసినా అఖండ మూవీ కి ఘన స్వాగతమే లభించింది.
మరి ఇంతటి విజయవంతమైన అఖండ మూవీ రేపు శుక్రవారం తమిళనాట కూడా అడుగుపెట్టబోతుంది. అఖండ తమిళ డబ్బింగ్ వెర్షన్ రేపు థియేటర్స్ లో రిలీజ్ చెయ్యబోతున్నారు. అక్కడ కోలీవుడ్ నుండి ఒక్క సినిమా కూడా రేపు రిలీజ్ కావడం లేదు. కరోనా నిబంధనల మధ్యన సినిమాలు రిలీజ్ చెయ్యడం లేదు. ఒక్క అఖండ నే రేపు థియేటర్స్ లోకి రాబోతుంది. సో అఖండ కి అలా తమిళనాట కలిసొచ్చింది. మరి రెండు తెలుగు రాష్ట్రాలు, హాట్ స్టార్ లోనూ ఎదురు లేని బాలకృష్ణ అఖండ పైకి తమిళనాట కూడా స్వాగతం లభిస్తుందో.. లేదో.. చూడాలి.