బాలీవుడ్ లో నాగిన్ సీరియల్ తో సూపర్ పాపులర్ అయిన మౌని రాయ్ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాల కోసం సైజ్ జీరో గా మారి పోయి సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో హల్చల్ చేస్తూ ఉనికిని చాటుకోవడమే కాదు.. అవార్డు ఫంక్షన్స్ కి, బాలీవుడ్ ఈవెంట్స్ కి హీరోయిన్స్ ని తలదన్నే రీతిలో డ్రెస్సింగ్ స్టయిల్ తో ఆకట్టుకునేది. కెరీర్ కోసమే ఇంతిలా నాగిన్ మౌని రాయ్ గ్లామర్ గా రెచ్చిపోతుంది అనుకున్నారు అయితే మౌని రాయ్ ఉన్నట్టుండి పెళ్లి పీటలెక్కింది.
తనకి నచ్చిన సూరజ్ నంబియార్ ని ఈ రోజు జనవరి 27 ఉదయం వివాహమాడింది. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గోవా లో తన ఇష్టసఖుడు సూరజ్ తో మౌని రాయ్ ఏడడుగులు నడిచింది. మౌని రాయ్ పెళ్ళిలో మందిరా బేడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మౌని రాయ్ - సూరజ్ నంబియార్ ల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అవి చూసిన నెటిజెన్స్ అదేమిటి నాగిన్ అప్పుడే పెళ్లి చేసేసుకుంది అంటున్నారు. సింపుల్ గా జరిగిన ఈ పెళ్ళికి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరూ హాజరవలేదు. మరి మౌని రాయ్ రిసెప్షన్ లో ఏమైనా సెలబ్రిటీస్ సందడి ఉంటుందేమో చూడాలి.