Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ తో రామ్ చరణ్ నాటు డాన్స్


మెగాస్టార్ చిరంజీవి గారు గుడ్ లక్ సఖి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి రావాల్సి వుంది. కానీ ఆయనకి కరోనా పాజిటివ్ రావటంతో, మెగా స్టార్ కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్ ఆ సినిమా ఈవెంట్ కి చిరంజీవి గారి తరపున హాజరు అయ్యారు. ఈ ఫంక్షన్ లో సినిమా కథానాయక అయిన కీర్తి సురేష్ సినిమా గురించి మాట్లాడక, రామ్ చరణ్ ని ఒక చిన్న కోరిక కోరారు. ట్రిపిల్ ఆర్ లోని నాటు నాటు పాటకి తనతో రామ్ చరణ్ డాన్స్ చెయ్యాలని ఆమె కోరారు. ఈవెంట్ అయ్యి చివరగా రామ్ చరణ్ కూడా మాట్లాడక, కీర్తి సురేష్ రామ్ చరణ్ కి మళ్ళీ గుర్తు చేసారు తనతో ఒక్కసారి డాన్స్ చెయ్యాలి అని. 

Advertisement
CJ Advs

రామ్ చరణ్ కీర్తి ని అడిగారు, మీరు కూడా స్టెప్స్ వెయ్యగలరా ఆ పాటకి, దానితో కీర్తి ముందు ఆ సాంగ్ కి స్టెప్స్ వేసి చూపించింది. అంటే ఆమె ముందుగానే ఆ పాటకి డాన్స్ ప్రిపేర్ అయి వచ్చింది. వెంటనే ట్రిపిల్ ఆర్ లోని ఆ నాటు నాటు పాటని ప్లే చేసారు, చరణ్ సరదాగా కీర్తి తో కలిసి స్టెప్స్ వేశారు. దానితో ఆ ఈవెంట్ కి హాజరైన మెగా అభిమానులు ఆనందానికి హద్దుల్లేవు.

Ram Charan dances with Keerthy Suresh for Naatu Naatu step:

Good Luck Sakhi Pre Release event highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs