రాధేశ్యామ్ మూవీ జనవరి 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా తో థియేటర్స్ క్లోజ్ అవడంతో.. ఆ సినిమా వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీ కాబట్టి పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చింది. రాధేశ్యామ్ జనవరిలోనే రిలీజ్ అని.. మేకర్స్ ప్రమోషన్స్ కూడా చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. కానీ కరోనా ఏది సాగనివ్వలేదు. అయితే కరోనా కారణంగా జనవరిలో వాయిదా పడిన సినిమాలన్నీ మార్చ్, ఏప్రిల్ లో విడుదల డేట్స్ ఇచ్చేస్తుంటే.. రాధేశ్యామ్ మేకర్స్ ఇంకా రిలీజ్ ఇవ్వకుండా కామ్ గా ఉన్నారు.
దానితో రాధేశ్యామ్ ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. అందుకే థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి జంకుతున్నారు అని, రాధేశ్యామ్ ఓటిటి రిలీజ్ కి 400 కోట్ల భారీ ఆఫర్ రావడంతో మేకర్స్ రాధేశ్యామ్ ని ఓటిటిలో చెయ్యడానికి రెడీ అయ్యారని అంటుంటే.. రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ మాత్రం రాధేశ్యామ్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే రాధాకృష్ణ రిపబ్లిక్ డే కి విషెస్ చెబుతూ.. రాధేశ్యాం మూవీ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది అని చెప్పి సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారనే రూమర్స్ కి చెక్ పెట్టాడు. ఇక థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వమన్న నెటిజెన్ కి కరోనా తగ్గి ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడతాయో అప్పుడే సినిమా రిలీజ్ అంటూ రాధాకృష్ణ ఫుల్ క్లారిటీ చేసాడు.