ఆర్.ఆర్.ఆర్ మొదలుపెట్టినప్పటి నుండి.. ఇద్దరు స్టార్ ల పాత్రల్లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి? ఇద్దరి పాత్రల నిడివి ఎలా ఉంటుంది? ఏ పాత్ర ఎక్కువగా హైలెట్ అవుతుందో? ఎవరి పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో? ఏ హీరో లుక్ ప్రేక్షకులకి నచ్చుతుందో? అంటూ కొలతల్లో కొలుస్తున్నారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్. కాని రాజమౌళి మీరేం కంగారు పడక్కర్లేదు. ఒక్కసారి ఆర్.ఆర్.ఆర్ థియేటర్స్ కి వెళ్లి సినిమాలో లీనమైతే.. మీకు ఎవరి పాత్ర ఎంత హైలెట్ అనే విషయమే గుర్తుకు రాదు, అంతలా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయని చెప్పి కవర్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఫాన్స్ కి ఇదే చెబుతూ వచ్చారాయన.
కానీ తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ మధ్యన చిచ్చు రగిల్చారు. ఆర్.ఆర్.ఆర్ జనవరి 7 నుండి వాయిదా పడిన తర్వాత రీసెంట్ గా రిలీజ్ డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి ఓ తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, ఏ పాత్ర హైలెట్ అవుతుంది అని అడగగా.. నాకు రెండు పాత్రలు నచ్చాయి, రామ్, భీం రెండూ రెండే.. అందులో ఏది తక్కువ, ఏది తక్కువ అని చెప్పడం కష్టం. కాకపోతే ఈ రెండు పాత్రల్లో కొంచెం ఎక్కువ ఇష్టపడే పాత్ర రామ్ పాత్రే అంటూ తనకి అల్లూరి సీతారామ రాజు పాత్ర అంటే ఇష్టమని చెప్పి ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళ కలిగించారు.
మరి ఇప్పుడు రామ్ చరణ్ ఫాన్స్ రెచ్చిపోయి మా హీరోనే గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ పై, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రపై పడితే.. అటు ఎన్టీఆర్ ఫాన్స్ ఊరుకుంటారా..? అస్సలూరుకోరు. రాజమౌళి ఎందుకిలా చెప్పారో కానీ.. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ మధ్యన యుద్ధం మొదలైనట్లే.