బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేస్తున్న టైం లో దర్శకుడు క్రిష్ తన భార్య కి విడాకులు ఇచ్చి ఒంటరి వారయ్యారు. క్రిష్ కి డాక్టర్ భార్య రమ్య కి మధ్యన తలెత్తిన విభేదాల కారణంగా వాళ్ళ మధ్యన డివోర్స్ అయ్యాయి అని, కాదు.. ఓ హీరోయిన్ క్రిష్ కాపురంలో చిచ్చు పెట్టింది ఇలా చాలా ప్రచారాలు జరిగాయి. తర్వాత టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ విడిపోయారు. చైతన్య - సమంత విడాకుల మేటర్ ఇంకా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న టైం లోనే, కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకుని షాకిచ్చారు. మరోపక్క చిరు చిన్న కూతురు శ్రీజ భర్తకి విడాకులు ఇవ్వబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా మరో యంగ్ డైరెక్టర్ తన భార్య తో విడిపోతున్నాడంటున్నారు. ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపుల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా తన భార్య లతతో విడిపోయారని.. ప్రచారం స్టార్ట్ అయ్యింది. లతకి తరుణ్ భాస్కర్ అమ్మ, నటి గీతా భాస్కర్‌తో పడకపోవడంతో.. తరుణ్ భాస్కర్ భార్య తో విడిపోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే తరుణ్ భాస్కర్ తల్లి గీత భాస్కర్ తరుణ్ వాళ్లతో కలిసి ఉండడం లేదట. ఈ విషయమై భార్య భర్తల మధ్యన మాట మాట పెరిగి డివోర్స్ డెసిషన్ కి వచ్చారని అంటున్నారు. లతా కూడా ఇండస్ట్రీకి రిలేటెడ్ అమ్మాయే కావడం, తరుణ్ భాస్కర్ కెరీర్ డౌన్ లో ఉండడం, ఇలా పలు రకాల కారణాలు వారి విడాకులకు కారణంగా చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.