ఇప్పుడు స్టార్ హీరోస్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాయలో ఉన్నారు. అలా వైకుంఠపురములో, అఖండ మూవీస్ తో థమన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఏ స్టార్ హీరో చూసినా థమన్ పేరే పలవరిస్తున్నారు. థమన్ నేపధ్య సంగీతానికి అందరూ మమైమరిచిపోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC15 నుండి.. ప్రభాస్ రాధే శ్యామ్ వరకు అన్నిటికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. భం భం అఖండ అంటూ థమన్ నిజంగానే భం భం థమన్ లా టాలీవుడ్ కి మారిపోయాడు. స్టార్ హీరోల ఫాన్స్ కూడా థమన్ ఉంటే ఆ సినిమా హిట్ అంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, నాగ చైతన్య థాంక్యూ, విజయ్ 66 మూవీ, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్, వరుణ్ తేజ్ గని, మహేష్ - త్రివిక్రమ్ SSMB28 ఇలా చేతిలో స్టార్ హీరోల సినెమాలతో థమన్ మ్యూజిక్ టాలీవుడ్ లో మార్మోగడం ఖాయం. మరి ప్రస్తుతం థమన్ RC15 మ్యూజిక్ విషయంలో తన బ్యాండ్ తో మ్యూజిక్ నే రెడీ చేసేస్తున్నాడట. ఎప్పుడూ లేజీ గా సినిమాలు చేసే థమన్ ఈసారి సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడట. అందుకే ఇప్పుడు ఏ స్టార్ హీరో అయినా.. థమన్ ని ఫస్ట్ చాయిస్ అంటున్నారట.