Advertisement
Google Ads BL

మేర్లపాక గాంధీ మళ్ళీ ఆ హీరో తో


మాస్ట్రో తరువాత దర్శకుడు మేర్లపాక గాంధీ ఏమి చేస్తున్నాడు అని అనుకుంటున్నారా. ఆయన తన తదుపరి సినిమా ఏ హంగామా లేకుండా సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నాడట. ఈసారి కూడా అతను సంతోష్ శోభన్ ని హీరో గా పెట్టి సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందు సంతోష్ తో ఏ మినీ కథ అని ఒక సినిమా చేసి అది ఓ టి టి లో రిలీజ్ చేసాడు మేర్లపాక. మాస్ట్రో కూడా ఓ టి టి లోనే వచ్చింది. ఇప్పుడు మేర్లపాక మళ్ళీ సంతోష్ తో ఇంకో సినిమా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టి.. బిజీ అయ్యాడట. జాతి రత్నాలు లో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా ఇందులో కథానాయిక. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకు లో జరుగుతోంది. ఇందులో బ్రహ్మాజీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. మేర్లపాక కి బ్రహ్మాజీ సెంటిమెంట్ అతని మొదటి సినిమా నుండి వుంది, అందుకని ఈ రాబోయే సినిమాలో కూడా బ్రహ్మాజీ కి ఒక ప్రధాన పాత్ర ఇచ్చినట్టు సమాచారం. శ్యామ్ సింగ రాయ్ నిర్మించిన వెంకట్ బోయిన్పల్లి ఈ సినిమాకి నిర్మాత. షూటింగ్ స్టార్ట్ అయి అప్పుడే రెండు వారాలు అయింది అని భోగట్టా. హైదరాబాద్ లో ఒక పాట కూడా చిత్రీకరించి తర్వాతి షెడ్యూల్ ని అరకులో చేస్తున్నారు. ఆ తరువాత షెడ్యూల్ కోసం రాజముండ్రి వెళతారని సమాచారం.

Merlapaka Gandhi again with Santosh Shoban:

Faria Abdullah to team up with Santosh Shoban
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs