Advertisement
Google Ads BL

సాయి ధరమ్ డాషింగ్ అండ్ క్లాసీ లుక్


గత ఏడాది వినాయక చవితి ఫెస్టివల్ రోజున మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురై ప్రాణాపాయ స్థితిలో అపోలో ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని దసరా టైం కి ఇంటికి చేరాడు. భుజానికి ఆపరేషన్, ఓకల్ కార్డు ఆపరేషన్ ఇలా మేజర్ ఆపరేషన్స్ తో తిరిగి కోలుకున్నాడు. అయితే సాయి తేజ్ ఇంటికి సేఫ్ గా వచ్చినా.. ఫాన్స్ కి మాత్రం చాలా అరుదుగా కనిపించాడు. మెగా ఫ్యామిలిలో జరిగిన దివాళి వేడుకల్లో కనిపించిన సాయి ధరమ్ తేజ్.. నటించిన రిపబ్లిక్ మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా ప్లాప్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఇక సాయి తేజ్ యాక్సిడెంట్ జరిగి కొన్ని నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన కొత్త సినిమా మొదలు పెట్టలేదు. దానితో సాయి ధరమ్ తేజ్ గొంతు కి ఇంకా ప్రాబ్లెమ్ ఉంది, అతనికి స్పీచ్ థెరపీ జరుగుతుంది అందుకే పెద్దగా బయటకి రావడం లేదని అన్నారు. అయితే కొత్త సంవత్సరం వేడుకలతో కొత్తగా మేకోవర్ అయ్యారు మెగా హీరో సాయి తేజ్. సాయి తేజ్ చైర్ లో స్టైలిష్ గా కూర్చున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా క్లాసీ, డాషింగ్ లుక్ లో సాయి ధరమ్ తేజ్ దర్శనమివ్వడంతో ఆయన ఫాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. 

Sai Dharam dashing and classy look:

Sai Dharam dashing look goes viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs