Advertisement
Google Ads BL

ఓటీటీ బాట పట్టిన తండ్రీ కొడుకులు


చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు చియాన్ విక్రమ్. ఎంతో అంకితభావంతో చేసిన ఐ వంటి భారీ చిత్రాలు కూడా తనకి నిరుత్సాహాన్నే మిగిల్చాయి. ఓవైపు తనకే హిట్టు లేక కొట్టుకుంటూ కొడుకుని లాంచ్ చేస్తే అతనూ పరాజయాన్నే మూట కట్టుకురావడం విక్రమ్ కి మరింత బాధాకరంగా మారింది. అదీ అర్జున్ రెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ ని ఏరికోరి ఎంచుకుని ఆ సినిమా తమిళ్ రీమేక్ ఆదిత్యవర్మగా తనయుడు ధృవ్ ని తెరపైకి పంపితే..... తెలుగు, హిందీ భాషల్లో దుమ్మురేపిన ఆ కథ తమిళ్ లో తుస్సుమంది. ఇక తనయుడికి అండగా నిలిచేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగిన విక్రమ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నేతృత్వంలో మహాన్ అనే సినిమా చేశాడు . విక్రమ్-ధృవ్ ల కాంబినేషన్, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ అనగానే ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రూపంలో అదృష్టం మరోసారి అడ్డం తిరిగింది. అయితే అమెజాన్ తలుపులు తెరుచుకోవడంతో మరో ఆలోచన లేకుండా మేరా అమెజాన్ ప్రైమ్ మహాన్ అనబోతున్నాడు చియాన్. 

Advertisement
CJ Advs

విక్రమ్, ధృవ్, వాణి, సిమ్రన్ ముఖ్య పాత్రల్లో ఇంట్రెస్టింగ్ ఏక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మహాన్ మూవీ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. ఒక్క తమిళ్ లోనే కాదండోయ్... తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా. సూర్య లాంటి హీరో ఓటీటీ మెట్లెక్కి వరుసగా రెండు హిట్లు కొట్టడం విక్రమ్ కి బాగా భరోసా ఇచ్చి ఉండొచ్చు. అదే తరహా ఫలితం లభిస్తే తానూ, తన తనయుడు కూడా ఆనందించొచ్చు. 

Mahaan on amazon prime:

Mahaan on amazon prime from feb 10th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs