తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ మన వెంకీ అట్లూరి దర్శకత్వం లో ఒక తెలుగు తమిళ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా ఈమధ్యనే స్టార్ట్ అయింది, పదిహేను రోజులు షూటింగ్ కూడా చేసారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగింది అని చెప్పిన.. నిన్నటివరకు సర్ మూవీ షూటింగ్ కి అంతరాయం కలగలేదు. అయితే ఈమధ్యన ధనుష్ ఎందుకో కొంచెం బాగోలేదని చెప్పి, కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో కరోనా పాజిటివ్ అని తెలిసింది.
దానితో వెంటనే సర్ షూటింగ్ ఆపేసారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో వున్నారు. ఇప్పుడు కేవలం వారం రోజులు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది కాబట్టి, షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తారని కూడా సమాచారం. దీని కోసం పెద్దగా బయట లొకేషన్స్ కి వెళ్లాల్సిన పనిలేదు అంటున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్ దీనికి నిర్మాత. ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ లో తెరకెక్కుతుంది.