Advertisement
Google Ads BL

అక్కడ హైపర్ ఆది, ఇక్కడ సుడిగాలి సుధీర్


ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ లో కామెడీ చెయ్యడానికి కమెడియన్స్ కరువయ్యారు. చమ్మక్ చంద్ర, ఆర్పీ, అదిరే అభి, రజినీకాంత్, అవినాష్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదిలి వెళ్లిపోయారు. గురువారం హైపర్ అది స్కిట్స్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్స్ తో జబర్దస్త్ నడుస్తుంది. వీరిద్దరూ తమ స్కిట్స్ తో కామెడీ ప్రియులని ఆకట్టుకుంటున్నారు. అయితే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు ఈ వారం పుష్ప స్కిట్స్ తో జబర్దస్త్ స్టేజ్ పై అదరగొట్టేసారు.

Advertisement
CJ Advs

గురువారం హైపర్ ఆది పుష్ప రాజ్ లా గెటప్ వేసి.. తన స్కిట్ లోని వాళ్ళని పుష్ప సినిమాలో కేరెక్టర్స్ వేయించాడు. అందులో శాంతి స్వరూప్ అనసూయ దాక్షాయణి గెటప్ లో ఇరగదీసాడు. హైపర్ ఆది పుష్ప గెటప్ వేసాడు. ఇక పరదేశి, అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జు రైట్ హ్యాండ్ గా నటించిన నటుడితో పుష్ప స్కిట్ తో హైపర్ ఆది అదరగొట్టేసాడు. తరవాతి రోజు సుడిగాలి సుధీర్ పుష్ప స్కిట్ చేసాడు. సుడిగాలి సుధీర్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ లా, ఫహద్ ఫాసిల్ లా గెటప్ శ్రీను తమ కామెడీ తో అదరగొట్టేసారు. అద్భుతమైన పంచెస్ తో అటు హైపర్ ఆది, ఇటు సుడిగాలి సుదీర్లు పుష్ప స్పూఫ్స్ తో జబర్దస్త్ స్టేజ్ పై ఆకట్టుకున్నారు.

Pushpa movie Spoof | Hyper Aadi & Raising Raju Performance:

Sudigali Sudheer Pushpa movie Spoof
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs