Advertisement
Google Ads BL

దేవరకొండ కి నో చెప్పిన సమంత


ఇప్పుడు సమంత డివోర్స్ మేటర్ వదిలి.. ఆమె పుష్ప లో చేసిన ఐటెం సాంగ్ విషయమే మాట్లాడుకుంటున్నారు అందరూ. నిన్నమొన్నటివరకు అయ్యయ్యో సమంత నాగ చైతన్య కి విడాకులు ఇచ్చేసింది.. వాళ్ళు విడిపోయారు అని మట్లాడుకున్న వారు.. ఇప్పుడు సమంత చేసిన ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావ ఐటెం సాంగ్ ఇరగదీసేసింది అంటున్నారు. నిజంగానే పుష్ప మూవీలో అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ ఒక ఎత్తు, సమంత ఐటెం సాంగ్ ఒక ఎత్తు అన్న రేంజ్ లో ఆ సాంగ్ పాన్ ఇండియాలో పాపులర్ అయ్యింది. అందుకే ఇప్పుడు సమంత తో ఐటెం సాంగ్ చేయించాలని చాలామంది తపన పడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే కోవలోకి విజయ్ దేవరకొండ వచ్చాడట. అంటే తన లైగర్ మూవీ లో సమంత తో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తే.. సినిమాకి మైలేజ్ వస్తుందని విజయ్ దేవరకొండ ఆలోచనట.

అది దర్శకుడు పూరి తో కలిసి చర్చించి సమంత తో మాట్లాడడానికి వెళ్లారట. ఇంతకుముందు సమంత కి విజయ్ దేవరకొండకి మంచి స్నేహం ఉంది. మహానటి సినిమాలో వీరిద్దరూ కలిసి వర్క్ చేసారు. అందుకే విజయ్ దేవరకొండ ఆఫర్ ని సమంత కూడా కాదనదనే అనుకున్నారు అంతా.. కానీ సమంత కి మరో ఐటెం సాంగ్ చేసే ఉద్దేశ్యం లేదట. అందుకే విజయ్ దేవరకొండ లైగర్ ఆఫర్ ని సమంత సున్నితంగా తిరస్కరించింది అని, అలాగే తాను పాన్ ఇండియా మూవీస్ తో బిజీ కాబోతున్న కారణంగానే ఇక మీద స్పెషల్ సాంగ్స్ జోలికి పోకూడదని డిసైడ్ అయ్యి.. విజయ్ కి నో చెప్పినట్లుగా తెలుస్తుంది.

Samantha says no to Devarakonda:

Samantha says no to Vijay Devarakonda Liger Special song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs