మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా తట్టుకుని నిలబడి, అన్ని ప్రతికూల పరిస్థితులతో పోరాడి అనూహ్య విజయం సాధించిన చిత్రం పుష్ప. ముఖ్యంగా ఈ చిత్రానికి నార్త్ ఇండియా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం వల్ల సినిమా రేంజే మారిపోయిందని చెప్పాలి. ఎంతోమంది ఫిల్మ్ సెలబ్రిటీస్ తో పాటు పలువురు క్రికెటర్స్ సైతం పుష్పగా బన్నీ స్టన్నింగ్ పెరఫార్మెన్సుకి ఫిదా అయిపోవడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమాంతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. పుష్ప ది రైజ్ అంటూ వచ్చిన ఈ పార్ట్ 1 కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ గా రానున్న పుష్ప ది రూల్ పై ఎక్సపెక్టషన్స్ హెవీగా పెరిగాయని, మేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఇక ఇప్పటికే ఓటీటీ కి కూడా వచ్చేసిన పుష్పకి ఆల్ మోస్ట్ అన్ని ఏరియాస్ లో థియేట్రికల్ రన్ పూర్తయిపోయినట్లే.! ఈ సందర్భంగా ఓసారి పుష్ప లెక్కల నిష్పత్తిని పరిశీలిద్దాం.
నైజాం : 37.10 cr
సీడెడ్ : 15.00 cr
ఉత్తరాంధ్ర : 8.03 cr
ఈస్ట్ : 4.89 cr
వెస్ట్ : 4.14 cr
గుంటూరు : 5.34 cr
కృష్ణా : 4.25 cr
నెల్లూరు : 3.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) : 82.00 cr
తమిళనాడు : 10.90 cr
కేరళ : 5.30 cr
కర్ణాటక : 10.70 cr
రెస్ట్ : 42.00 cr
ఓవర్సీస్ : 14.25 cr
టోటల్ వరల్డ్ వైడ్ : 161.15 cr
మరిప్పుడు పుష్ప ది రైజ్ బిజినెస్ అండ్ ప్రాఫిట్ మ్యాటర్ లోకి వస్తే అన్ని వెర్షన్లు కలుపుకుని 145.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా ఫుల్ రన్ కంప్లీట్ అయేసరికి 165.15 కోట్ల రూపాయల భారీ షేర్ రాబట్టాడు పుష్ప. ఈ విధంగా ఫైనల్ ప్రాఫిట్ 19.15 కోట్లుగా తేలింది. నిజానికి టికెట్ రేట్ ఆంక్షల వల్ల ఆంధ్రాలో బయ్యర్లు కాస్త నష్టాలు చవి చూసారు కానీ లేకుంటే అక్కడి పంపిణీదారుల్ని కూడా ఆనందపెట్టి ఫైనల్ ప్రాఫిట్ ఫిగర్ ని మరింత బెటర్ గా చూపించేవాడు బన్నీ. సర్లెండి... పుష్ప రూల్ చేసే టైమ్ కి అన్నీ చక్కబడతాయని ఆశిద్దాం.