Advertisement
Google Ads BL

బోయపాటికి సవాల్ విసిరిన బాలయ్య.!


వరుస విజయాలు సాధించే కలయికల పట్ల స్పెషల్ క్రేజ్ క్రియేట్ అవడం వెరీ కామన్. అయితే ఆ కామన్ థింగ్ కూడా ఖంగు తినేలా ఒకదాన్ని మించిన మరొక ఘన విజయంతో కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ మాస్ హిస్టీరియాకి మీనింగ్ చెబుతూ సాటిలేని సంచలనం సృష్టిస్తోంది బాలకృష్ణ.. బోయపాటిల కాంబినేషన్. రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఈ రేంజ్ హిట్స్ ఇచ్చిన జంట ఏ నాటా లేదనేది ప్రతినోటా వినిపిస్తోన్న మాట. ఇటీవలే అఖండ విజయం అంటే ఏంటో అర్ధం చెప్పి హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన వీరిద్దరి కాంబినేషన్ త్వరలోనే డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టనుంది అఖండ సీక్వెల్ తో.! ఈ సందర్భంగానే బోయపాటితో ఒక ఛాలెంజ్ చేశారట బాలయ్యబాబు. ఆ సరదా సంఘటనలోకి వెళితే....

Advertisement
CJ Advs

ఈ మధ్య కాలంలో అనితరసాధ్యం అయిపోయిన 50 రోజుల వేడుకను ఏకంగా 100 కి పైగా థియేటర్స్ లో జరుపుకున్న అఖండ విజయోత్సవాన్ని అభిమానుల నడుమ జరుపుకున్నారు నందమూరి నటసింహం. ఆ కార్యక్రమం అనంతరం మరి ఎప్పుడు మొదలుపెడదాం మన నెక్స్ట్ సినిమా అని అడిగారట బోయపాటిని. నాకు ఒక కమిట్ మెంట్ ఉంది బాబూ.. ఆ సినిమా చేసేసి మన సినిమాకి వచ్చేస్తాను అన్నారట బోయపాటి. సరే మీరు ఆ ఒకటీ చేసి వచ్చేలోపు మేమిక్కడ రెండు, మూడు లాగించేస్తాం చూడండి అనే సవాల్ విసురుతూ సరదాగా నవ్వేశారట బాలయ్యబాబు. 

సో... అసలే ఈ మధ్య అన్ స్టాపబుల్ అంటూ తన టైమింగ్ తో, హ్యూమర్ తో ఆహా అనిపించే ట్రెమండస్ టాక్ షో చేస్తోన్న బాలయ్య అదే ఊపుని, ఉత్సాహాన్ని ఆఫ్ స్క్రీన్ కూడా చూపిస్తున్నారన్నమాట..!!

balakrishna challanges boyapati:

balakrishna challange to boyapati, akhanda sequel details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs