కొన్ని నెలల కిందట సమంత.. నాగ చైతన్యతో సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వాళ్లిద్దరూ కూడా తాము ఎందుకు విడిపోయారు అన్నదానిమీద ఎక్కువగా మాట్లాడలేదు. సమంత, నాగ చైతన్య ని బ్లేమ్ చేస్తూ ఎక్కడా మాట్లాడలేదు. తన మనసులోని బాధని కొటేషన్స్ రూపం లో రాసుకొచ్చేది. ఈమధ్య నాగ చైతన్య కూడా బంగార్రాజు ప్రమోషన్స్ లో కూడా సమంత గురించి బాగానే మాట్లాడాడు. ఇద్దరం సంతోషంగా వున్నాం అని చెప్పాడు. అయితే సమంత మాత్రం నాగ చైతన్య తో కలిసేందుకు పాజిటివ్ గా, ఆశగా కూడా వుంది అంటున్నారు.
ఏంటి ఆ ఆశ అంటే, తాను మళ్ళీ నాగ చైతన్య తో కలవొచ్చు అన్న విషయం మీద. అందుకే ఎక్కడా ఒక్క మాట కూడా తన విడాకుల గురించి మాట్లాడటం లేదు. ఎప్పటికయినా మళ్ళీ చైతన్యని ఒప్పించి ఇద్దరం కలిసి ఉండొచ్చు అన్న ఆశ సమంత కి చాలా ఎక్కువగా ఉందట. అందుకేనేమో ఆమె ఈమధ్య ఎక్కువగా నాగార్జున స్నేహితులతో తిరుగుతూ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్నేహితులే మళ్ళీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చవచ్చు అని సమంత తరపు వాళ్ళు అనుకుంటున్నారు.
విడిపోతున్నాం అన్న వార్త వచ్చేముందు సమంత ఎక్కువగా గుళ్ళూ గోపురాలు బాగా తిరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, సమంత మరియు నాగ చైతన్య ఇద్దరికీ కూడా ఒకరే మేనేజర్. అతను ఇద్దరికీ కావలసిన వాడే. మరోపక్క సమంత తన సోషల్ మీడియా ఎకౌంట్ నుండి నాగ చైతన్య తో విడిపోతున్నట్టుగా పెట్టిన పోస్ట్ ని తాజాగా తొలిగించడంతో.. వీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం ఉంది అంటూ నెటిజెన్స్ కూడా ఉత్సాహం గా ఎదురు చూస్తున్నారు.