ఈటివి నుండి నాగబాబు వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటుగా చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి టాప్ కమెడియన్స్ వెళ్లిపోయారు. నాగబాబు తోటే తమ కెరీర్ అన్నట్టుగా వాళ్ళు జీ ఛానల్ లో వచ్చిన కామెడీ షోలో వచ్చేవారు. తర్వాత జీ ఛానల్ లో ఆ కామెడీ షో ఆగిపోయింది.. నాగబాబు తో పాటుగా ఆ కమెడియన్స్ తెరమరుగయ్యారు. మళ్ళీ స్టార్ మా ద్వారా ఆ కమెడియన్స్ తమ ఉనికిని చాటుతున్నారు. అయితే ఈమధ్యన నాగబాబు జీ ఛానల్ తర్వాత స్టార మా లో వస్తున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి శేఖర్ మాస్టర్ తో పాటుగా జేడ్జ్ గా వస్తున్నారు. నాగబాబు జేడ్జ్ గా, జబర్దస్త్ నుండి జంప్ అయిన ఆర్పీ లాంటి కమెడియన్స్ కూడా స్టార్ మా లోని కామెడీ స్టార్స్ లో స్కిట్స్ చేసుకుంటున్నారు.
కొన్ని రోజులుగా కొంతమంది కమెడియన్స్ జబర్దస్త్ కి బై బై చెప్పేస్తున్నారు. అందుకే జబర్దస్త్ లో స్కిట్స్ కూడా తగ్గిపోయాయి. కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నా గతంలోలా జబర్దస్త్ లో కామెడీ పండడం లేదు. జబర్దస్త్ మొదలైనప్పటినుండి నిన్నటివరకు జబర్దస్త్ నే అంటిపెట్టుకున్న అదిరే అభి ఇప్పుడు జబర్దస్త్ కి హ్యాండ్ ఇచ్చేసి స్టార్ మా లో నాగబాబు జేడ్జ్ గా ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కి వచ్చేసాడు. జబర్దస్త్ కి అదిరే అభి కాంట్రాక్టు పూర్తవడంతోనే.. అక్కడ మల్లెమాల కి బై చెప్పేసి ఇక్కడ కామెడీ స్టార్స్ లో వాలిపోయాడని, స్టార్ మా రెమ్యునరేషన్ కూడా జబర్దస్త్ కన్నా ఎక్కువగా ఉండడంతోనే అభి జబర్దస్త్ ని వదిలేసాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ముక్కు అవినాష్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదిలేసారు. ఇప్పుడు అభి కూడా.