అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ పుష్ప ద రైజ్ డిసెంబర్ 17 న రిలీజ్ అయ్యి ఐదు భషాల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. హిందీలో చిన్నగా మొదలైన పుష్ప కలెక్షన్స్.. చివరికి ఓ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. హిందీలో పుష్ప సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ రాయలసీమ భాషలో చేసిన పెరఫార్మెన్స్ ని విమర్శకుల సైతం మెచ్చుకున్నారు. పుష్ప సినిమాని పర్ఫెక్ట్ ప్రమోషన్స్ తో గనక రిలీజ్ చేసి ఉంటే.. ఈ సినిమాకి మేకర్స్ మరిన్ని లాభాలు వెనకేసుకునేవారు. ఇక పుష్ప రాజ్ థియేటర్స్ జాతర, అటు ఓటిటి జాతర కూడా ముగిసింది.
ఇక ఇప్పుడు అందరిలో పార్ట్ 2 అంటే పుష్ప ద రూల్ పై ఆసక్తి మొదలయ్యింది. అయితే పుష్ప ద రూల్ షూటింగ్ సంక్రాంతి తర్వాత మొదలు కాబోతుంది అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా మార్చ్ నుండే పుష్ప ద రూల్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట. ఈ విషయం పుష్ప లో హీరోయిన్ శ్రీవల్లి గా నటించిన రష్మిక ఓ నేషనల్ ఛానల్ కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది. పుష్ప ద రూల్ మూవీ షూటింగ్ మార్చ్ నుండి మొదలు కాబోతుంది అని, డిసెంబర్ లో పార్ట్ 2 రిలీజ్ ఉంటుంది అని చెప్పింది.