Advertisement
Google Ads BL

బ్యాక్ టు బ్యా హిట్స్ తో పాప ఎక్కడికో


ఉప్పెన సినిమాతో బేబమ్మ గా అందరి మనసులని దోచేసిన కృతి శెట్టి.. ఆ సినిమాలో క్యూట్ గా స్వీట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టేసింది. ఆ సినిమా విదుదల కాకుండానే నాలుగు ప్రాజెక్టులకి సైన్ చేసింది. యంగ్ హీరోల సినిమాల్లో కృతి శెట్టి బుక్ అయ్యింది. ఒకేసారి ఐదు సినిమాలతో యంగ్ బ్యూటీస్ కి షాకిచ్చింది. రామ్ తో ద వారియర్ మూవీ చేస్తున్న కృతి శెట్టి.. ఉప్పెన తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ తో బంపర్ హిట్ కొట్టింది. సెకండ్ హీరోయిన్ అయితేనేమి, శ్యామ్ సింగ్ రాయ్ హిట్ కృతి శెట్టి ఖాతాలోకి చేరింది. 

Advertisement
CJ Advs

ఇక నిన్నగాక మొన్న బంగార్రాజు తో సంక్రాంతికి వచ్చి నాగలక్ష్మి గా అదిరిపోయే హిట్ అందుకుంది. నాగ చైతన్య తో కలిసి బంగార్రాజు లో లంగా వోణి, కళ్ళజోడు తో పల్లెటూరి పాపలా అదరగొట్టేసింది. మరి వరస హిట్స్ తో కృతి శెట్టి రేంజ్ మారిపోయింది. వరసగా మూడు హిట్స్.. చేతిలో మరో మూడు సినిమాలు. సుధీర్ బాబు తో ఒక సినిమా, రామ్ తో ద వారియర్, నితిన్ తో మాచర్ల నియోజక వర్గం మూవీ తో కృతి శెట్టి షూటింగ్స్ తో బిజీగా వుంది. బంగార్రాజు ప్రమోషన్స్ లో లంగా వోణి తో ట్రెడిషనల్ గర్ల్ గా అదరగొట్టేసింది. మరి మూడు హిట్స్, మూడు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న కృతి శెట్టి.. కి కొత్త సినిమాల అవకాశాలు తలుపు తడుతున్నాయని.. కానీ కృతి శెట్టి ఆచి తూచి ఆఫర్స్ ని ఒప్పుకుంటుంది. ఇకపై కృతి శెట్టి రేంజ్ తో పాటుగా పారితోషకం కూడా పెరగడం ఖాయం.

Krithi Shetty goes to brilliant heights with back-to-back hits:

Krithi Shetty Busy With Back To Back Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs