Advertisement
Google Ads BL

గుడ్ న్యూస్ అంటున్న బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్


బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంతో క్రేజీ గా అడుగుపెట్టి.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో టైటిల్ ఫెవరెట్ గా మారిన షణ్ముఖ్ జాస్వంత్ తాను చేసుకున్న తప్పిదాల వలన బిగ్ బాస్ టైటిల్ చేజార్చుకోవడమే కాదు, అతనికున్న క్రేజ్ కూడా దెబ్బతింది. బిగ్ బాస్ కారణంగా తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోవడమే కాకుండా వ్యక్తిగతంగానూ షణ్ముఖ్ చాలా కోల్పోయాడు. తన ప్రియురాలు దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పడం షణ్ముఖ్ ని కోలుకోలేని దెబ్బతీసింది. అటు కెరీర్, ఇటు పర్సనల్ లాస్ తో షణ్ముఖ్ ఏమైపోతాడో అని ఆయన ఫాన్స్ బాగా భయపడ్డారు. అయితే దీప్తి సునయన బ్రేకప్ ని స్వాగతిస్తూ ఆమె నిర్ణయానికి గౌరవం ఇస్తూ న్యూ ఇయర్ తర్వాత కెరీర్ కి సంబందించిన గుడ్ న్యూస్ చెబుతా అన్నట్టుగానే షణ్ముఖ్.. బిగ్ బాస్ తర్వాత తన కెరీర్ కి సంబందించిన ఓ గుడ్ న్యూస్ చెప్పి ఫాన్స్ ని ఆనందింప చేసాడు. 

Advertisement
CJ Advs

వెబ్ సీరీస్, యూట్యూబర్ అయిన షణ్ముఖ్.. కొత్తగా వెబ్ సీరీస్ మొదలు పెడుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు. ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే కొత్త వెబ్ సీరీస్ ని సుబ్బు కే డైరెక్షన్ లో మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పాడు. యూట్యూబ్‌లో నా నెక్ట్స్ వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ అని.. ఈ సిరీస్ చూసినంత సేపు నా పేరు మీ మొహంలో చిరునవ్వుతో ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత ఏం ఆఫర్ వచ్చినా ఫస్ట్ ఒక యూట్యూబ్ సిరీస్ చేయాలని అని ఉంది. ఈ వెబ్ సీరీస్ తో బాగా నవ్విస్తాం.. టెన్షన్స్ అన్నీ మరిచిపోయేలా నవ్విస్తాం.. అంటూ షణ్ముఖ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. 

Bigg Boss Fame Shanmukh Says Good News:

Shanmukh New Web Series Agent Anand Santosh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs