Advertisement
Google Ads BL

మళ్ళీ హీరోగా కనిపిస్తాడా?


మెగా ఫ్యామిలీలోకి ఇల్లరికం అల్లుడిగా అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్.. హీరోగా ఆ ఫ్యామిలీ అండతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తో వివాహమయిన వెంటనే కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. అప్పుడు మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ కళ్యాణ్ దేవ్ కి ఉంది. కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ విజేత సినిమాని మెగా ఫ్యామిలీ ఎత్తేసింది. ఆ సినిమా సో సో గా ఆడినా.. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ తో సినిమాలు చెయ్యడానికి దర్శకనిర్మాతలు వెంటపడ్డారు. కారణం ఆయన వెనుక మెగా ఫ్యామిలీ ఉంది కాబట్టి. అలా రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టేసాడు కళ్యాణ్ దేవ్. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడనే న్యూస్ తో ఆయన నటించిన సెకండ్ మూవీని మెగా ఫ్యామిలీ అస్సలు పట్టించుకోలేదు. కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి అలా వచ్చింది ఇలా వెళ్ళింది. కానీ ఎవరూ ఆ సినిమా విషయం ఎత్తలేదు, ప్రమోట్ చెయ్యలేదు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక తర్వాత కళ్యాణ్ దేవ్ నటించిన కిన్నెరసాని రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆ సినిమా ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ చేసిన మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అక్కడ. మరి ఈ మూడు సినిమాలతో కళ్యాణ్ దేవ్ దుకాణం సర్దేస్తాడో.. లేదంటే ఇంకా సినిమాలు చేస్తాడో చూడాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే హీరో అయ్యాడు.. హీరోగా నిలదొక్కుకోవాలంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. 

కానీ ఇప్పుడు కళ్యాణ్ దేవ్ కి ఆ సపోర్ట్ లేదు. మళ్ళీ సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం తప్ప.. కళ్యాణ్ ని హీరోగా ఎవరూ పట్టించుకోరు. సో కళ్యాణ్ దేవ్ మళ్ళీ హీరోగా కనిపిస్తాడా.. లేదో అనేది డౌటే.

Will he look like a hero again?:

 Will Kalyan Dev be a hero again?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs