అక్కినేని అనే పేరు నుండి సమంత రౌత్ ప్రభుగా మారిన సమంతకి క్రేజీ ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. అక్కినేని ఇంటి కోడలిగా అందాలు ఆరబోసినా రాని ఆఫర్స్, చైతు కి విడాకులిచ్చాక వరసగా వచ్చేస్తున్నాయి. చైతు తో డివోర్స్ తర్వాత చైతూ మీద కోపమో.. కెరీర్ లో దూసుకుపోవాలని ఆలోచనో కానీ.. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావా అంటూ రెచ్చిపోయి అందాల ఆరబొయ్యడంతో.. సమంత అందాలకు ఫిదా అయిన బాలీవుడ్ ఇప్పుడు సమంత వెంట పడుతుంది. బాలీవుడ్ లోని అగ్ర దర్శకనిర్మాతలు సమంత తో కొన్ని మూవీస్ చెయ్యడానికి రెడీ అవడమే కాకుండా ఆమెతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
రాజ్ అండ్ డీకే తో మరో వెబ్ సీరీస్ ఒప్పుకుంటున్న సమంత బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిం బ్యానర్‌లో సినిమాలు చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. యష్ రాజ్ ఫిలిం బ్యానర్‌లో సమంత ఏకంగా మూడు సినిమాలు చెయ్యడానికి డీల్ సెట్ చేసుకుందనే న్యూస్ ముంబై మీడియాలో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. మరోపక్క సమంత తెలుగు, తమిళంలో బై లింగువల్ మూవీస్ చేస్తుంది. సమంత నటిస్తున్న యశోద మూవీ ఫుల్ స్వింగ్ లో షూట్ జరుపుకుంటుంది. అలాగే సమంతకి పుష్ప తర్వాత బోలెడన్ని ఐటెం సాంగ్ ఆఫర్స్ వస్తున్నా సమంత మాత్రం ఆ సాంగ్స్ చెయ్యడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని వినికిడి.