Advertisement
Google Ads BL

నాగార్జున చేతిలో తిట్లు తిన్న డైరెక్టర్


నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన బంగార్రాజు సినిమా అసలైన సంక్రాంతి హిట్ గా నిలిచింది. బంగార్రాజు భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. నాగార్జున సెంటిమెంట్ ని బంగార్రాజు నిజం చేసింది. అయితే నాగార్జున తో బంగార్రాజు సినిమా చేసిన కళ్యాణ్ కృష్ణ నాగార్జున తో తిట్లు తిన్నాడట. అది కూడా నాగ చైతన్య - రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైం లో నాగార్జున కళ్యాణ్ కృష్ణ ని చెడా మడా తిట్టేశారట. అదే విషయాన్ని అలీ తో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొన్న కళ్యాణ్ కృష్ణ ని అలీ అడిగారు. ఏంటి నాగార్జున మిమ్మల్ని ఒకసారి తిట్టారట అని.

Advertisement
CJ Advs

దానికి కళ్యాణ్ కృష్ణ అవునండి రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైం లో ఒకరిద్దరి తప్పులని కవర్ చేసినందుకు నాగార్జున గారు పిలిచి వారి తప్పులని ఎన్నాళ్లని కవర్ చేస్తావ్.. దానివలన సినిమా రిలీజ్ లేట్ అవుతుంది అంటూ తిట్టేసారు. కానీ అక్కడ నా తప్పు లేకపోయినా వాళ్ళని కాపాడే క్రమంలో తిట్లు తిన్నాను అని చెప్పాడు కళ్యాణ్ కృష్ణ. ఇక బంగార్రాజు కథ నాగార్జునకి ఎప్పుడో చెప్పా అని, అది నచ్చిన నాగ్ ఈ సినిమాని ఎప్పుడు చేసినా సంక్రాంతి టార్గెట్ గానే రిలీజ్ చెయ్యాలని ముందే ఫిక్స్ అయ్యామని, అలానే బంగార్రాజు ని సంక్రాంతికి రిలీజ్ చేశామని చెప్పాడు కళ్యాణ్ కృష్ణ. 

Director cursed by Nagarjuna:

Kalyan Krishna clarification on Cold War with Nagarjuna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs