Advertisement
Google Ads BL

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే ఈరోజు. ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్.. రీసెంట్ గా వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. అలాగే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ నిర్మాతగా గని మూవీలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ బర్త్ డే సంబందర్భంగా ఆయన నటిస్తున్న గని మూవీ నుండి టీజర్ రిలీజ్ చేసి.. వరుణ్ తేజ్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసింది. గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా సిక్స్ ప్యాక్ లుక్ లో అలరించబోతున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక మరో మూవీ ఎఫ్ 3 నుండి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది ఎఫ్ 3 టీం. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఎఫ్ 3 టీం నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వరుణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇది వరకే తెలిపింది చిత్రయూనిట్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లోనూ వరుణ్ తేజ్ చేతిలో కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. వేసవి సందర్భంగా ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది వరకు ఏప్రిల్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దాని కంటే ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.

మరి సక్సెస్ ఫుల్ హీరో వరుణ్ తేజ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Mega Prince Varun Tej Birthday Special :

<span>Team F3 Wishes Varun Tej On His Birthday With A Brand New Poster</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs