Advertisement
Google Ads BL

చిరు కూడా చేతులెత్తేసారా


మెగాస్టార్ చిరు సినిమాలతో బిజీగా ఉండడమే కాదు.. ఆయన ఫ్యామిలీ తో హ్యాపీ గా గడుపుతున్న సమయంలో తన చిన్న కూతురు శ్రీజ వలన సఫర్ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఒకసారి శ్రీజ ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకున్న టైం లో మెగా ఫ్యామిలీ చాలా బాధ పడింది. చిరు ఆ బాధలో నుండి బయట పడడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత శ్రీజ, శిరీష్ కి విడాకులిచ్చి మళ్లీ తండ్రి చెంత చేరింది. ఆ తర్వాత తండ్రి తో, ఫ్యామిలీ తో ఉంటూ తన విడాకుల బాధని మరిచిపోయిన శ్రీజ ని చిరు తన ఫ్రెండ్ కొడుకు కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యడమే కాకుండా.. ఇల్లరికం కూడా తెచ్చుకున్నారు. 

Advertisement
CJ Advs

మళ్ళీ మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లు విరిసింది. కళ్యాణ్ దేవ్ కి శ్రీజ ప్రేమకి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. అయితే గత రెండేళ్లుగా ప్రేమగా ఉన్న శ్రీజ - కళ్యాణ్ ల మధ్యన బేధాభిప్రాయాలు తలెత్తడంతో.. విడాకుల దిశగా ఈ జంట ప్రయాణం చేస్తున్నదనే న్యూస్ కి బలం చేకూరుస్తూ శ్రీజ తన పక్కన ఉన్న కళ్యాణ్ పేరుని తొలగించి శ్రీజ కళ్యాణ్ నుండి.. శ్రీజ కొణిదెలగా మార్చడంతో.. ఇప్పుడు వాళ్ల విడాకుల మేటర్ బయటికి పొక్కింది.

అయితే మెగాస్టార్ చిరు తన చిన్న కూతురు శ్రీజ కి, చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కి మధ్యన ప్యాచప్ చెయ్యడానికి చాలా ట్రై చేస్తున్నారని, వాళ్ల మధ్యన వచ్చిన బేధాభిప్రాయాలు పోగొట్టేందుకు ప్రయత్నాలు చేసున్నారని.. వీరిద్దరిని కలిపేందుకు మెగా ఫ్యామిలీ కష్టపడింది అని, కానీ వారి మధ్యన సఖ్యత రాక పోగా.. మరింత దూరం పెరిగింది అని, చిరు కూడా కూతురికి నచ్చ చెప్పలేక చేతులెత్తేశారని అంటున్నారు. అందుకే కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం కూడా మానేశారనే టాక్ నడుస్తుంది. కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయినా.. ఏ ఒక్క మెగా హీరో కూడా కళ్యాణ్ దేవ్ ని సపోర్ట్ చేయకపోవడానికి శ్రీజనే కారణమంటూ సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. 

Chiranjeevi Daughter Sreeja Drops Husband Name On Instagram:

Chiranjeevi daughter Sreeja to part ways from husband Kalyaan Dhev?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs